rapist baba: యువతికి 8 నెలల పాటు నరకం చూపిన కీచక బాబా అరెస్టు!

  • బాబా ముసుగు వేసుకున్న మరో కీచకుడు
  • 8 నెలలపాటు అత్యాచారం చేసిన బాబా
  • భూకబ్జాల్లో బాబాది అందెవేసిన చెయ్యి
  • విద్యాసంస్థలను నడిపే సీతాపూర్ బాబా

బాబా ముసుగు వేసుకున్న కీచకుడి ఉదంతం బట్టబయలైంది. డేరా బాబా గుర్మీత్, ఫలహారీ బాబా ఉదంతాల తరహాలోనే ఉత్తరప్రదేశ్‌ లో సీతాపూర్ బాబా ను కూడా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లో వివిధ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న సీతాపూర్ బాబా అలియాస్ సియారామ్ బాబాకు రింటూ సింగ్ అనే పరమ భక్తురాలు ఉంది. ఆమెకు 21 ఏళ్ల దళిత యువతిని ఆమె బంధువు ఒకరు అమ్మేశాడు. దీంతో ఆ యువతిని రింటూ సింగ్ బాబావద్దకు తీసుకెళ్లింది.

తాను నడిపే కాలేజ్ లో బెడ్ రూం కూడా ఏర్పాటు చేసుకున్న సీతాపూర్ బాబా అప్పటి నుంచి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. కేవలం బాబా మాత్రమే కాకుండా, ఆయన వద్దకు వచ్చిన మరికొందరు కూడా తనపై అత్యాచారానికి తెగబడ్డట్టు బాధితురాలు పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక స్థిరాస్తి సెటిల్మెంట్ కు ఆగ్రాకు వెళ్లిన బాబాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రింటూ సింగ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. సీతాపూర్ బాబా‌పై లక్నో, బారాబంకి, ఆగ్రా చుట్టుపక్కల బోలెడు అక్రమాస్తులు కూడబెట్టాడన్న ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 

rapist baba
sitapur baba
uttar pradesh
  • Loading...

More Telugu News