highest paid tv actress: అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న టీవీ న‌టీమ‌ణుల జాబితాలో ప్రియాంక‌కు ఎనిమిదో స్థానం

  • 50 శాతం ఆదాయం ప్ర‌క‌ట‌న‌ల ద్వారానే
  • `క్వాంటికో` సిరీస్‌తో హాలీవుడ్ ఎంట్రీ
  • ప్ర‌స్తుతం మూడో సీజ‌న్‌కి చేరుకున్న షో

అంత‌ర్జాతీయ స్టార్ ప్రియాంక చోప్రా మ‌రోసారి ప్రపంచంలో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న టీవీ న‌టీమ‌ణుల జాబితాలో చోటు సంపాదించింది. ఫోర్బ్స్ మేగ‌జైన్ విడుద‌ల చేసిన జాబితాలో ఈ సారి కూడా ఎనిమిదో స్థానంలో నిలిచి టాప్ 10లో మ‌రోసారి నిలిచింది.

 జూన్ 1, 2016 నుంచి జూన్ 1, 2017 మ‌ధ్య కాలంలో టీవీ కార్య‌క్ర‌మాల ద్వారా ప్రియాంక 10 మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించిన‌ట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఇందులో 50 శాతానికి పైగా ఆదాయం ప్ర‌క‌ట‌న‌ల ద్వారానే పొందిన‌ట్లు తెలిపింది. `క్వాంటికో` టీవీ సిరీస్ ద్వారా హాలీవుడ్ బుల్లితెర మీద అడుగు పెట్టిన ప్రియాంక, కొద్దికాలంలోనే త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

ప్ర‌స్తుతం ఈ టీవీ సిరీస్‌కి సంబంధించిన మూడో సీజ‌న్ షూటింగ్‌లో ప్రియాంక పాల్గొంటోంది. ఈ జాబితాలో ఈసారి కూడా కొలంబియా న‌టి సోఫియా వెర్గారా 41.5 మిలియ‌న్ డాల‌ర్ల సంపాద‌న‌తో మొద‌టి స్థానంలో నిలిచింది. గ‌త ఆరేళ్ల నుంచి సోఫియా వెర్గారా మొద‌టి స్థానంలో ఉంది. ఈమె న‌టిస్తున్న `మోడ్ర‌న్ ఫ్యామిలీ` టీవీ సిరీస్‌కు అమెరికాలో మంచి పేరుంది.

highest paid tv actress
priyanka chopra
quantico
alex parrish
sofia vergara
modern family
8th place
forbes
  • Loading...

More Telugu News