jai lava kusa: 100 కోట్లను కొల్లగొట్టిన 'జై లవ కుశ': కళ్యాణ్ రామ్

  • 100 కోట్ల క్లబ్ లో 'జై లవ కుశ'
  • వరుసగా 100 కోట్లు కొల్లగొట్టిన జూనియర్ రెండో సినిమా
  • అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన కల్యాణ్ రామ్

జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన 'జై లవ కుశ' బ్లాక్ బస్టర్ మూవీగా అవతరించింది. మూడు పాత్రల్లో జూనియర్ కనబరిచిన అద్భుత నటనకు ప్రేక్షకులు జేజేలు కొడుతున్నారు. తొలి ఆటతోనే హిట్ టాక్ ను సంపాదించుకున్న ఈ చిత్రం... మన దేశంలోనే కాకుండా, ఓవర్సీస్ లో సైతం అదరగొడుతోంది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

ఈ సందర్భంగా ఈ సినిమా నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'జై లవ కుశ' సినిమా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిందని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. రూ. 100 కోట్ల కలెక్షన్లను ఈ సినిమా దాటేసిందని... ఇంకా వసూళ్లను రాబడుతూనే ఉందని చెప్పాడు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.

విడుదలైన మూడు రోజులకే రూ.75 కోట్లు రాబట్టిన ఈ సినిమా వారం రోజుల్లోపే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. మరోవైపు, వరుసగా రెండు ఎన్టీఆర్ సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరడం గమనార్హం. 'జై లవ కుశ' కు ముందు వచ్చిన 'జనతా గ్యారేజ్' కూడా వంద కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టింది.

jai lava kusa
ntr
kalyan ram
jai lava kusa collections
jai lava kusa crosses 100 cr
  • Loading...

More Telugu News