controversy comments: దసరా ఉత్సవాల్లో రాముడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక సాహితీ వేత్త

  • మానవత్వం లేని రాముడు దేవుడు ఎలా అవుతాడు?
  • కట్టుకున్న భార్యను వదిలేసిన వాడు ఏ విషయంలో ఆదర్శవంతుడు?
  • అలాంటి వ్యక్తిని చూసి ఏం నేర్చుకోవాలి?
  • సాహితీ వేత్త భగవాన్ విమర్శలు 

మైసూరు దసరా ఉత్సవాల సందర్భంగా కర్ణాటక సాహితీ వేత్త శ్రీరాముడిపై సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ప్రముఖ సాహితీ వేత్త భగవాన్ మైసూరులో దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, నిండుగర్భిణి అని కూడా ఆలోచించకుండా సీతను అడవికి పంపి మానవత్వాన్ని మంటగలిపిన రాముడికి అయోధ్యలో భవ్య మందిరం నిర్మించాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నించారు.

రాముడికి ఆలయం నిర్మించేందుకు బీజేపీ, సంఘ్‌ పరివార్‌ పడుతున్న పాట్లు నగుబాటుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మానవత్వం లేని రాముడు దేవుడు ఎలా అవుతాడు? అని ఆయన అడిగారు. కట్టుకున్న భార్యను వదిలేసిన వాడు ఏ విషయంలో ఆదర్శవంతుడు అవుతాడు? అని ఆయన నిలదీశారు. అలాంటి వ్యక్తిని చూసి ఏం నేర్చుకోవాలి? అని ఆయన ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. 

controversy comments
sriram
bhagawan
  • Loading...

More Telugu News