ram gopal varma: ప్రేమ, పదవీకాంక్ష, వెన్నుపోటు... 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కథ ఇదేనన్న రామ్ గోపాల్ వర్మ!

  • అది వ్యక్తి హృదయంలో ప్రేమను పుట్టించిన అడుగు 
  • వందల మందికి ద్వేషాన్నీ కలిగించింది
  • ఎన్టీఆర్ బంధువుల మధ్య నమ్మలేని వివాదాలు
  • 2018లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదలన్న వర్మ

"ఒక అడుగు ఓ వ్యక్తి హృదయంలో ప్రేమను పుట్టిస్తే, అదే అడుగు వందల మందికి ద్వేషాన్ని కలిగించింది. ఆ ఒక్క అడుగు ఆ వ్యక్తిలో కలిగించిన పునరుత్తేజం, మళ్లీ లక్షల మంది ప్రేమించే విధంగా చేసింది" ఇదే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కథ అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ చిత్రంలో ప్రేమ కథతో పాటు ద్వేషం, అసూయ, పదవీకాంక్ష, వెన్నుపోటు సహా బంధువుల మధ్య నమ్మలేని అంతర్గత విభేదాలు, వివాదాలు ఉంటాయని, 2018 డిసెంబర్ లోగా తెలుగు రాష్ట్రాల్లో చిత్రం విడుదల అవుతుందని తన సోషల్ మీడియా ఖాతాలో రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

 కాగా, ఈ చిత్రం తొలి పోస్టర్ ను వర్మ నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫోటోగ్రాఫర్ బీ నవీన్ కల్యాణ్, పబ్లిసిటీ డిజైనర్ ద్వయం అనిల్, భానూలు అద్భుతంగా పనిచేసి తొలి చిత్రాన్ని రూపొందించారని, దీనిపై వస్తున్న స్పందన తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఈ సందర్భంగా వర్మ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News