drone: ప్రపంచంలోనే తొలి ఉభయచర డ్రోన్ ను తయారు చేసిన చైనా కంపెనీ
- జలాంతర్గాములను కూడా గుర్తించగల సామర్థ్యం
- సరకులను దీవులకు చేర్చుతుంది
- షాంఘైకి చెందిన యూవీఎస్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ తయారీ
ప్రపంచంలోనే తొలి ఉభయచర డ్రోన్ ను చైనా కంపెనీ తయారు చేసింది. ఈ డ్రోన్ జలాంతర్గాములను గుర్తించడంతో పాటు సరకులను దీవులకు చేర్చగలదని దీనిని తయారు చేసిన సంస్థ వెల్లడించింది. దీనిని షాంఘైలోని యూవీఎస్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనే ప్రైవేటు కంపెనీ రూపొందించింది.
దీనికి 'యూ 650' అనే పేరు పెట్టారు. వీటి వాణిజ్యపరమైన ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ లియు జియాండాంగ్ ప్రకటించారు. చైనీస్ ఎక్స్ ప్రెస్ డెలివరీ కంపెనీతో పాటు దక్షిణాసియాలో మరో సంస్థకు వాణిజ్య సేవలను ప్రారంభించామని ఆయన వెల్లడించారు.