most valuable brands: అత్యంత విలువైన బ్రాండ్ల జాబితా: టాప్ 10లో చోటు సంపాదించుకున్న ఫేస్‌బుక్‌

  • మొద‌టి స్థానంలో ఆపిల్‌, రెండో స్థానంలో గూగుల్‌
  • టాప్ 10 స‌గానికి పైగా టెక్నాల‌జీ కంపెనీలే
  • టాప్ 100లో మొద‌టిసారి స్థానం సంపాదించుకున్న నెట్‌ఫ్లిక్స్‌, ఫెర్రారీ

బ్రాండ్ విలువ‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన టాప్ 100 కంపెనీల జాబితాను ఇంట‌ర్‌బ్రాండ్ కంపెనీ విడుద‌ల చేసింది. ఈ జాబితాలో మొద‌టి ప‌ది స్థానాల్లో టెక్నాల‌జీ కంపెనీలే ఉన్నాయి. ఈ జాబితాలో ఆపిల్‌, గూగుల్ సంస్థ‌లు వ‌ర‌స‌గా ఐదో సారి మొద‌టి రెండో స్థానాల్లో నిలిచాయి. ఆపిల్ బ్రాండ్ విలువ 184.1 బిలియ‌న్లుగా, గూగుల్ బ్రాండ్ విలువ 141.7 బిలియ‌న్లుగా ఇంట‌ర్‌బ్రాండ్ నివేదిక పేర్కొంది.

ఇక మూడో స్థానంలో మైక్రోసాఫ్ట్ నిలిచింది. దీని బ్రాండ్ విలువ 79.9 బిలియ‌న్ డాల‌ర్లు. గ‌తేడాది మూడో స్థానంలో ఉన్న కోకో కోలా కంపెనీ నాలుగో స్థానానికి ప‌డిపోయింది. ఇంకా ఈ జాబితాలో అమెజాన్‌, శాంసంగ్‌, ట‌యోటా, ఫేస్‌బుక్, మెర్సిడెజ్ బెంజ్‌, ఐబీఎం కంపెనీలు నిలిచాయి. టాప్ 10లో ఫేస్‌బుక్ స్థానం సంపాదించ‌డం ఇదే మొద‌టిసారి.

ఫేస్‌బుక్, అమెజాన్‌, అడిడాస్‌, స్టార్‌బ‌క్స్ కంపెనీల బ్రాండ్ విలువ గ‌తేడాదితో పోల్చితే గ‌రిష్టంగా పెరిగింద‌ని నివేదిక తెలిపింది. అలాగే ఆన్‌లైన్ స్ట్రీమింగ్ స‌ర్వీస్‌ నెట్‌ఫ్లిక్స్‌, క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ‌ సేల్స్‌ఫోర్స్‌, కార్ల కంపెనీ ఫెర్రారీలు మొద‌టి సారి టాప్ 100 జాబితాలో చోటుసంపాదించుకున్నాయి. ఈ టాప్ 100 కంపెనీల బ్రాండ్ విలువ మొత్తంగా క‌లిపి 1871.7 బిలియ‌న్లుగా ఉంద‌ని నివేదిక వెల్ల‌డించింది. గ‌తేడాది కంటే ఇది 4.2 శాతం ఎక్కువ‌.

  • Error fetching data: Network response was not ok

More Telugu News