princess diana: డయానా సౌందర్యవతి అంటున్న ట్రంప్.. వెలుగులోకి పాత ఇంటర్వ్యూ

  • డయానా చాలా అందగత్తె
  • ఆమెతో డేటింగ్ చేయలేకపోవడం నా జీవితంలో పెద్ద లోటు
  • అమెరికా అధ్యక్షుల వారి మనసులో మాట 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్లేబోయ్ ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు చెందిన ఎన్నో టేపులు బయటకు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా మరో టేపు వెలుగు చూసింది. అందులో బ్రిటీష్ యువరాణి, ప్రిన్సెస్ ఆవ్ వేల్ అంటే తనకు ఎంతో పిచ్చి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టేపులో బయటపడ్డాయి. 2000లో రేడియో హోస్ట్ హోవార్డ్ స్టెర్న్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ట్రంప్ వ్యాఖ్యానించారు.

 డయానా చాలా అందగత్తె అని... మంచి పొడగరి అని కితాబు ఇచ్చారు. డయానాను ట్రంప్ చాలాసార్లు కలిశారట. ఈ సందర్భంగా ఎంతో విలువైన బొకేలను డయానాకు ట్రంప్ ఇచ్చేవారట. ఒకనొక సందర్భంలో, తనపై ట్రంప్ కు ఉన్న అభిమానాన్ని చూసి ఏం చేయాలో కూడా డయానాకు అర్థం కాలేదట. యాక్సిడెంట్ లో డయానా చనిపోయిన తర్వాత... ఆమెతో డేటింగ్ చేయలేకపోవడం తన జీవితంలోనే అతిపెద్ద లోటు అని స్నేహితులతో ట్రంప్ చెప్పాడట.  

princess diana
princess of whales
donald trump
trump crush on diana
  • Loading...

More Telugu News