posani: పాల స్వచ్ఛతకు లాక్టోమీటర్, జ్వరం తీవ్రతకు ధర్మామీటర్...ఎన్టీఆర్ నటనకు కూడా ఒక మీటర్ ఉంది: పోసాని

  • ఎన్టీఆర్ నటనను కొలిచేందుకు ఈస్తటిక్ మీటర్ అని ఉంది
  • ఈ రసహృదయం ఉన్నవాడు ఎన్టీఆర్ నటనలో దమ్ముఎంతుందో కొలవగలడు
  • తారక్ తో టెంపర్, జై లవకుశ సినిమాలు చేశాను
  • ఎన్టీఆర్ నటిస్తే పక్కన ఎవరూ కనిపించరు

పాలలోని స్వచ్ఛత కొలిచేందుకు లాక్టోమీటర్, జ్వరం తీవ్రత తెలుసుకునేందుకు ధర్మామీటర్ ఉన్నట్టే జూనియర్ ఎన్టీఆర్ నటనను కొలిచేందుకు కూడా ఒక మీటర్ ఉందని పోసాని కృష్ణమురళి తెలిపాడు. 'జై లవకుశ' సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ నటనను కొలిచేందుకు ఈస్తటిక్ మీటర్ ఉందని అన్నాడు. తెలుగులో దీనిని రసహృదయం అంటారని అన్నాడు.

ఈ రసహృదయం ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ నటనలో దమ్ముఎంతుందో కొలవగలడని చెప్పాడు. ఎన్టీఆర్ తో తాను 'టెంపర్', 'జై లవకుశ' సినిమాలు చేశానని, ఆయనతో కాంబినేషన్ సీన్ చేయాలంటే తానే ఎంతో భయపడతానని అన్నాడు. మొదట్లో 'ఛైల్డ్ ఆర్టిస్టు కదా ఏం ఫర్వాలేదులే' అనుకునేవాడినని, అయితే ఆయన యాక్ట్ చేసిన తరువాత అక్కడ మరెవరూ కనిపించరని పోసాని అన్నాడు. ఒక సీన్ కాపీని గంట ముందు తీసుకుని బై హార్ట్ చేసి, ఎన్టీఆర్ ముందుకు వెళ్లి చేసిన తరువాత 'ఇంకా ఇది సరిపోదేమో' అనిపించేదని పోసాని తెలిపాడు. 

posani
jr ntr
jailava kusha
  • Loading...

More Telugu News