mithali raj: వోగ్ ఇండియా మేగ‌జైన్ క‌వ‌ర్‌పై మెరిసిన మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీ రాజ్‌

  • షారుక్‌, నీతా అంబానీల స‌ర‌స‌న మ‌హిళా జ‌ట్టు కెప్టెన్‌
  • వోగ్ ఇండియా ప‌దో వార్షికోత్స‌వం సంద‌ర్భంగా మూడు క‌వ‌ర్ పేజీలు
  • ర‌ష్య‌న్ మోడ‌ల్ న‌టాలియాకు స్థానం

మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్‌లో భార‌త జ‌ట్టును ఫైన‌ల్స్ వ‌ర‌కు తీసుకెళ్లిన మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఫొటోను ప్ర‌తిష్టాత్మ‌క ఫ్యాష‌న్ మేగ‌జైన్ 'వోగ్' తమ భార‌త సంచిక‌పై ప్ర‌చురించింది. వోగ్ ప‌దో వార్షికోత్స‌వం సంద‌ర్భంగా అక్టోబ‌ర్ నెల సంచిక కోసం మూడు ర‌కాల క‌వ‌ర్ పేజీల‌ను వోగ్ ఇండియా విడుద‌ల చేసింది. వీటిలో ఒక క‌వ‌ర్ పేజీ మీద మిథాలీ రాజ్, షారుక్ ఖాన్, నీతా అంబానీల ఫొటోల‌ను ప్ర‌చురించింది.

మిగ‌తా రెండు క‌వ‌ర్ పేజీల మీద ప్రియాంక చోప్రా, అనుష్క శ‌ర్మ‌, సోన‌మ్ క‌పూర్‌, ట్వింకిల్ ఖ‌న్నా, క‌ర‌ణ్ జొహార్‌, ప‌ద్మాల‌క్ష్మి, ర‌ష్య‌న్ మోడ‌ల్ న‌టాలియా వొడియానోవా చిత్రాల‌ను ప్ర‌చురించింది. `విమెన్ ఆఫ్ ద ఇయ‌ర్ అండ్ ద మెన్ వియ్ ల‌వ్‌` పేరుతో వీరి చిత్రాల‌ను వోగ్ ఇండియా ప్ర‌చురించింది. బాలీవుడ్ సెల‌బ్రిటీలు, వ్యాపార‌వేత్త‌ల స‌ర‌స‌న మిథాలీ స్టార్‌గా ఎద‌గ‌డానికి మ‌హిళ‌ల క్రికెట్‌లో ఆమె ప్ర‌ద‌ర్శ‌నే కార‌ణ‌మ‌ని చెప్పుకోవ‌చ్చు. ఏదేమైనా క‌వ‌ర్ ఫొటోపై మిథాలీ రాజ్ బాలీవుడ్ హీరోయిన్ల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా క‌నిపిస్తుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.
 

mithali raj
vogue india
10th anniversary
shah rukh khan
nitha ambani
sonam kapoor
priyanka chopra
anushka sharma
  • Loading...

More Telugu News