quantum computing: క్వాంటమ్ కంప్యూటింగ్ దిశగా మైక్రోసాఫ్ట్ పయనం... వెల్లడించిన సత్య నాదెళ్ల
- సులభతరం కానున్న ఆటోమేషన్
- అంతుచిక్కని టెక్నాలజీని బయటపెట్టే అవకాశం
- మైకేల్ ఫ్రీడ్‌మన్ మోడళ్ల ద్వారా అభివృద్ధి
ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ను క్వాంటమ్ కంప్యూటింగ్ దిశగా అడుగులు వేయించనున్నట్లు సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు. తక్కువ సమయంలోనే ఆటోమేషన్ ప్రక్రియను పూర్తి చేయగల క్వాంటమ్ కంప్యూటింగ్ అమల్లోకి వస్తే సాంకేతిక రంగంలో గణనీయ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో జరిగిన ఇగ్నైట్ కాన్ఫరెన్స్‌లో సత్య నాదెళ్ల ప్రసంగించారు.
ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ కంప్యూటర్లకే పరిమితమైన ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తే అసాధ్యమనిపించే పనులన్నింటినీ కంప్యూటర్ సహాయంతో చేసుకునే వీలు కలుగుతుందని ఆయన వివరించారు. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫిజిక్స్, మేథమేటిక్స్, కంప్యూటర్ సైన్స్ నిపుణులను ఏకం చేయాలని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. సత్య నాదెళ్లతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్న మైకేల్ ఫ్రీడ్‌మన్ కూడా మాట్లాడారు. టోపాలజీ అనే గణిత ప్రక్రియల్లో ఫ్రీడ్‌మన్‌కి గొప్ప పరిజ్ఞానం ఉంది. ఫ్రీడ్‌మన్ మోడల్స్ ఆధారంగానే క్వాంటమ్ కంప్యూటర్‌ను సృష్టించడానికి మైక్రోసాఫ్ట్ ప్రయత్నిస్తోంది.