old city: పాతబస్తీలో దుబాయ్ షేక్ లు, ఒమన్ దేశీయుల అరెస్టు

  • పాతబస్తీలో కాంట్రాక్టు మ్యారేజీ కలకలం
  • కాంట్రాక్టు వివాహాలు చేస్తున్న ఖాజీ అరెస్టు
  • ఇద్దరు అరబ్ షేకులు, ఐదుగురు ఒమన్ దేశీయుల అరెస్టు

హైదరాబాదు, పాతబస్తీలోని అంతర్జాతీయ కాంట్రాక్టు మ్యారేజ్ బ్యూరోలపై పోలీసులు దాడులు నిర్వహించారు. చాంద్రాయణగుట్ట, తలాబ్ కట్ట తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన పాతబస్తీ పోలీసులు కాంట్రాక్ట్ వివాహాలు చేస్తున్న ఖాజీ అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు కాంట్రాక్ట్ వివాహాలు చేసుకునేందుకు వచ్చిన వయసుమళ్లిన ఇద్దరు దుబాయ్ షేక్ లు, ఐదుగురు ఒమన్ దేశీయులను కూడా అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, రెండు రోజుల క్రితం కాంట్రాక్టు వివాహాలకు వచ్చిన ఐదుగురు అరబ్ వృద్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 

old city
arub shaiks arrest
contract marriages
  • Loading...

More Telugu News