naga chaitanya: 'సవ్యసాచి'లో కీలకమైన రోల్ లో మాధవన్?

  •  చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి'
  •  కథానాయకుడిగా నాగ చైతన్య
  •  కీలకమై పాత్ర కోసం మాధవన్ తో సంప్రదింపులు
  •  సుముఖంగా వున్న మాధవన్

నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించి వదిలిన ఫస్టు పోస్టర్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. విభిన్నమైన కంటెంట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో ఒక కీలకమైన పాత్ర ఉండటంతో, ఆ పాత్ర కోసం మాధవన్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

 నిజంగానే మాధవన్ ను చందూ మొండేటి కలిసి కథ చెప్పాడట. మాధవన్ పాత్ర స్వరూప స్వభావాలను గురించి వివరించాడు. కథ బాగుందని చెప్పడమే కాకుండా .. తనకి ఇస్తానని చెప్పిన పాత్ర పట్ల కూడా మాధవన్ సంతృప్తిని వ్యక్తం చేశాడని అంటున్నారు. ఇంకా ఆయన ఈ సినిమాకి సైన్ చేయకపోయినప్పటికీ, దాదాపు ఆయన ఖరారైపోయినట్టేననే టాక్ వినిపిస్తోంది. చైతూ పెళ్లి తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.  

naga chaitanya
madhavan
  • Loading...

More Telugu News