mukesh ambani: మళ్లీ ముకేశే.. దేశంలో అత్యంత సంపన్నుడిగా కీర్తి!


రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ వరుసగా ఆరోసారి కూడా దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఈ ఏడాది ఆయన సంపద 58 శాతం పెరిగి రూ.2.57 లక్షల కోట్లకు చేరుకున్నట్టు హ్యూరన్ రూపొందించిన జాబితా పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ పరుగులు పెట్టడమే ఇందుకు కారణం. ముకేశ్ జన్మించిన యెమన్ దేశ జీడీపీ కంటే ఆయన సంపద విలువ 50 శాతం ఎక్కువ.

ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ కు తొలిసారి స్థానం దక్కింది. తొలి 15 మందిలో ఆయన చోటు సంపాదించుకున్నారు. ఇక హ్యూరన్ తాజా జాబితాలో పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ 8వ స్థానంలో నిలిచారు. గతేడాది ఆయన 25వ స్థానంలో ఉండగా ఈ ఏడాది ఆయన సంపద ఏకంగా 173 శాతం పెరిగి రూ.70 వేల కోట్లకు చేరుకుంది. దీంతో ఆయన జాబితాలో పైకి ఎగబాకారు.

mukesh ambani
reliance industries
richest man
india
  • Loading...

More Telugu News