uttam: తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో ఆందోళనలు నిర్వహిస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- తెలంగాణ సర్కారుపై టీపీసీసీ అధ్యక్షుడి ఆగ్రహం
- రైతు సంఘాలతో కలిసి సదస్సు
- భూ వివాదాల్లో రైతు సమన్వయ సమితుల జోక్యాన్ని ఒప్పుకోం
- రైతు పెట్టుబడి పథకంలో భాగంగా కౌలు రైతులకు కూడా లబ్ధి చేకూరాలి
తెలంగాణ సర్కారుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్‌లో రైతు సంఘాలతో కలిసి సదస్సులో పాల్గొన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.... భూ వివాదాల్లో రైతు సమన్వయ సమితుల జోక్యాన్ని తాము ఒప్పుకోబోమని చెప్పారు. రైతు సమితుల జోక్యం వల్ల స్థానిక సంస్థలు తమ అధికారాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పారు.
రైతు పెట్టుబడి పథకంలో భాగంగా కౌలు రైతులకు కూడా లబ్ధి చేకూరేలా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతుల హక్కులను కాలరాస్తే అందుకు వ్యతిరేకంగా తాము పోరాడతామని చెప్పారు. వచ్చేనెల 3న తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.