bini: బాస్కెట్ బాల్ ఆడుతున్న కుందేలు... పెయింటింగ్‌, క్లీనింగ్ కూడా చేస్తుంది!

  • గిన్నిస్ రికార్డు కూడా సృష్టించింది
  • ఏదైనా ఇట్టే నేర్చుకోగ‌ల సామ‌ర్థ్యం
  • సోష‌ల్‌మీడియాలో బోలెడంత మంది ఫాలోవ‌ర్లు

అమెరికాలోని లాస్ఏంజెలీస్ ప్రాంతానికి చెందిన షాయ్ అసోర్‌కి ఓ పెంపుడు కుందేలు ఉంది. దాని పేరు బినీ. ఇది అలాంటి ఇలాంటి కుందేలు కాదు. ఏ ప‌ని నేర్పించినా ఇట్టే నేర్చుకుంటుంది. ఒక‌రోజు అది బాస్కెట్ బాల్‌తో ఆడుకోవ‌డం చూసి షాయ్ దాని కోసం ప్ర‌త్యేకంగా చిన్న సైజు బాస్కెట్ బాల్ కోర్టు రూపొందించాడు. అందులో దానికి బాస్కెట్‌లో బాల్ వేయ‌డం నేర్పించాడు.

ఇప్పుడు అదే బాస్కెట్ బాల్ ఆట దానికి గిన్నిస్ రికార్డును తెచ్చిపెట్టింది. ఒక్క నిమిషంలో ఎక్కువ సార్లు (7 సార్లు) బాల్‌ను బాస్కెట్‌లో వేసిన కుందేలుగా బినీ రికార్డు సృష్టించింది. అంతేకాదండోయ్‌... ఈ కుందేలుకు పెయింటింగ్ వేయ‌డం కూడా వ‌చ్చు. అలాగే చిన్న వాక్యూమ్ క్లీన‌ర్‌తో త‌న నివాసాన్ని శుభ్రం చేసుకోవ‌డం కూడా తెలుసు. ఇది చేస్తున్న ప‌నుల‌ను షాయ్ సోష‌ల్ మీడియాలో పెడుతుంటాడు. అలా దీని ప‌నిత‌నానికి ఎంతో మంది ముచ్చ‌ట‌ప‌డి లైకుల వ‌ర్షం కురిపిస్తుంటారు. దీనికి సోష‌ల్ మీడియాలో దాదాపు 81 వేల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు తెలుసా! బినీ త‌న‌కు ఇంత పేరు తెచ్చిపెడుతుంద‌ని తానెప్పుడూ ఊహించ‌లేద‌ని షాయ్ అసోర్ చెబుతున్నాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News