sai dharam tej: సాయి ధరమ్ తేజ్ చేసేది 'తొలి ప్రేమ' రీమేక్?

  •  కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్
  •  'తొలి ప్రేమ' తరహాలో ఉంటుందన్న దర్శకుడు
  •  ఆ సినిమాను రీమేక్ చేస్తున్నారంటూ ప్రచారం
  •  క్లారిటీ కోసం అభిమానుల వెయిటింగ్  

సాయిధరమ్ తేజ్ .. బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందిన 'జవాన్' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, తేజు మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. కరుణాకరన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'తొలి ప్రేమ' కాన్సెప్ట్ కి దగ్గరగా ఈ సినిమా ఉంటుందని కరుణాకరన్ చెప్పాడు. దీంతో ఇది 'తొలి ప్రేమ' రీమేక్ అనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.

'తొలి ప్రేమ'తో 1998లో పవన్ కి కరుణాకరన్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. అప్పట్లో ఈ సినిమా కొత్త ట్రెండ్ ను సృష్టించింది. ఆ తరువాత ఆ స్థాయి సక్సెస్ ను కరుణాకరన్ అందుకోలేకపోయాడు. ఇక ఈ మధ్య కాలంలో సాయిధరమ్ తేజ్ కి సరైన హిట్ పడలేదు. దర్శకుడికి .. హీరోకి ఇద్దరికీ కూడా సూపర్ హిట్ అవసరం కావడంతో, 'తొలి ప్రేమ'ను రీమేక్ చేస్తున్నారనే టాక్ జోరందుకుంది. ఈ ప్రచారం పై కరుణాకరన్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.

  • Loading...

More Telugu News