renu: బ్యూటిఫుల్ ఉద‌య‌భాను, టాలెంటెడ్ జానీ మాస్ట‌ర్ తో రేణూ దేశాయ్ సెల్ఫీ!


త్వ‌ర‌లోనే 'స్టార్ మా' ఛానెల్ లో ప్రారంభం కానున్న ‘నాతోనే డ్యాన్స్‌’ అనే రియాలిటీ షోలో న‌టి, మోడ‌ల్‌, డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ రేణూ దేశాయ్ జ‌డ్జిగా క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. ఆ షో సెట్స్‌లో రేణూ దేశాయ్ సంతోషంగా గ‌డిపేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తోంది. ఈ షో సంద‌ర్భంగా ‘బ్యూటిఫుల్ ఉద‌య‌భాను, టాలెంటెడ్ జానీ మాస్ట‌ర్ తో క‌లిసి సెల్ఫీ దిగా’న‌ని ఆమె ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపింది. ఈ షో ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంద‌ని రేణూదేశాయ్‌ చెప్పింది. ఫ‌న్, రొమాన్స్‌, డ్యాన్స్‌, మ‌స్తీని మిస్ కాకండ‌ని పేర్కొంది.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News