viral video: ఇటలీలో ఎయిర్ షో జ‌రుగుతుండ‌గా ప్ర‌మాదం... పైలెట్ మృతి... వైర‌ల్ అవుతున్న వీడియో

  • ఇట‌లీలో జరిగిన ఎయిర్ షో 
  • స‌ముద్రంలో కుప్ప‌కూలిన జెట్ విమానం
  • క‌ళ్ల‌ముందే పైలెట్ మృతి

ఇట‌లీలోని టెర్రాచినా ప్రాంతంలో జ‌రుగుతున్న ఎయిర్ షోలో ప్ర‌మాదం జ‌రిగింది. వంద‌ల మంది ఆస‌క్తిగా తిల‌కిస్తుండ‌గానే ఓ జెట్ విమానం స‌ముద్రంలో ప‌డిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇటాలియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన ఈ జెట్ విమానం అప్ప‌టి వ‌రకు వివిధ విన్యాసాలు ప్ర‌ద‌ర్శించి వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

 చివ‌ర‌గా `ఫ్రెచ్చె టెర్రాచినా` అనే విన్యాసం ప్ర‌ద‌ర్శిస్తుండ‌గా అదుపు త‌ప్పి స‌ముద్రంలో ప‌డిపోయింది. వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ప్ప‌టికీ విమానం ఆచూకీని గుర్తించ‌డంలో కొద్దిగా ఆల‌స్యం జ‌రిగింది. దీంతో పైలెట్ మృత‌దేహాన్ని మాత్ర‌మే అధికారులు వెలికితీయ‌గ‌లిగారు. అయితే ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి స్ప‌ష్ట‌మైన కార‌ణాలు ఇటాలియ‌న్ ఎయిర్‌ఫోర్స్ అంచ‌నా వేయ‌లేక‌పోతోంది. దీనిపై విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు.

viral video
italian air force
jet plane accident
pilot dead
  • Error fetching data: Network response was not ok

More Telugu News