kofee day: కాఫీడే యజమాని వద్ద 650 కోట్ల రహస్య ఆస్తులు గుర్తించాం: ఐటీ శాఖ ప్రకటన

  • కెఫే కాఫీడే సంస్థల యజమాని వీజీ సిద్ధార్థ్ నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులు
  • కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ అల్లుడే వీజీ సిద్ధార్థ్
  • సిద్ధార్థ్ కు చెందిన 25 ప్రాంతాలపై దాడులు
  • 650 కోట్ల రహస్య ఆస్తుల గుర్తింపు
  • చర్యలు తీసుకుంటామన్న ఐటీ శాఖ

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ అల్లుడు, 'కెఫే కాఫీడే' సంస్థల యజమాని వీజీ సిద్ధార్థ్ నివాసం, కార్యాలయాలపై చేసిన దాడుల్లో 650 కోట్ల రూపాయల రహస్య ఆస్తులు వెలుగు చూసినట్టు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ డిపార్ట్ మెంట్) ప్రకటించింది. గత గురువారం నుంచి మూడు రోజుల పాటు బెంగళూరు, హసన్‌, చిక్‌మగుళూర్‌, చెన్నై, ముంబయిలలోని సిద్ధార్థ్ కు సంబంధించిన 25 ఆస్తులపై జరిపిన దాడుల్లో సుమారు 650 కోట్ల రూపాయలకు చెందిన రహస్య ఆస్తులను గుర్తించామని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోనున్నామని అన్నారు. 

  • Loading...

More Telugu News