mahesh babu: "మురుగదాస్ 'రమణ' తరువాత విజయకాంత్, 'స్టాలిన్' తరువాత చిరంజీవి రాజకీయాల్లోకి... మరి 'స్పైడర్' తరువాత?" అనడిగితే మహేష్ బాబు సమాధానం ఇది!
- మురుగదాస్ సినిమాల తరువాత పాలిటిక్స్ లోకి వచ్చిన స్టార్ హీరోలు
- మీరూ అలాగే వస్తారా? అని మహేష్ ను ప్రశ్నించిన మీడియా
- రాజకీయాలంటే స్పెల్లింగ్ కూడా తెలియదని సమాధానమిచ్చిన ప్రిన్స్
విభిన్న కథాంశాలను ఎంచుకుని, వాటిని ప్రేక్షకులకు నచ్చేలా చిత్రీకరించడంలో పేరున్న ప్రముఖ దక్షిణాది దర్శకుడు మురుగదాస్ గతంలో తీసిన 'రమణ' తరువాత విజయకాంత్ రాజకీయాల్లోకి వచ్చారు. ఇక అదే మురుగదాస్ చిరంజీవి హీరోగా 'స్టాలిన్' తీయగా, ఆపై ఆయన కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు అదే మురుగదాస్, మహేష్ హీరోగా 'స్పైడర్'ను సిద్ధం చేశారు. ఇక 'స్పైడర్' తరువాత మహేష్ కూడా సెంటిమెంట్ ప్రకారం, రాజకీయాల్లోకి వస్తారా? ఇదే ప్రశ్న మహేష్ బాబుకు చెన్నైలో ఎదురైంది.
మీడియా సమావేశంలో మహేష్ పాల్గొన్న వేళ, ఈ ప్రశ్న ఎదురుకాగా, తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు ప్రిన్స్. తనకు రాజకీయాలంటే స్పెల్లింగ్ కూడా తెలియదని అన్నాడు. అటువంటి ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు. కాగా, తమిళంలో 'స్పైడర్' చిత్రం ఎల్లుండి సుమారు 500 థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.