sara tendulkar: సినిమాల్లోకి సారా టెండూల్కర్... సచిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా?

  • బాలీవుడ్ ఎంట్రీకి సారా టెండూల్కర్ రెడీ?
  • సారాను లాంఛ్ చేయనున్న అమీర్ ఖాన్
  • రణ్ వీర్ సింగ్ లేదా అర్జున్ కపూర్ సరసన సారా
  • కూతురికి స్వేచ్ఛ నిచ్చిన సచిన్ 

టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ బాలీవుడ్ రంగ ప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు బాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి. సచిన్ కుమార్తెను బాలీవుడ్ కు మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ పరిచయం చేయనున్నాడు. ఈమేరకు కథలు కూడా విన్నాడు. సారా టెండూల్కర్ ను రణ్ వీర్ సింగ్ లేదా అర్జున్ కపూర్ ల సరసన నటింపజేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

గతంలో తన కుమార్తె చదువుకుంటోందని, ప్రస్తుతానికి ఆమెను సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచన లేదని సచిన్ టెండూల్కర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తన కుమార్తెకు కెరీర్ ను ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చానని తెలిపాడు. ఆమెకు అవసరమైన సూచనలు మాత్రమే చేస్తానని అప్పట్లో స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో సారా సినీ రంగ ప్రవేశంపై వార్తలు వెలువడడంతో సచిన్ తన కుమార్తె బాలీవుడ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

sara tendulkar
sachin tendulkar
amir khan. ranveer singh
arjun kapoor
  • Loading...

More Telugu News