Telugudesam: ఎన్టీఆర్ కు భారత రత్న ఇస్తే...తీసుకునేందుకు నేను వెళ్లను.. మీరే తీసుకోండి!: లక్ష్మీ పార్వతి

  • ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి
  • అవార్డు వస్తే నేను తీసుకుంటానన్నదే అభ్యంతరమైతే తీసుకునేందుకు నేను వెళ్లను
  • నేను ఎన్టీఆర్ భార్యను, ఆయనకు అవార్డు రావడమే ముఖ్యం
  • ఆయనకు వచ్చిన అవార్డును ఆయన కుటుంబ సభ్యులు ఎవరు తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు
  • లక్ష్మీ పార్వతి స్పష్టీకరణ 

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలని ఆయన భార్య లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు. ఒక టీవీ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ కు భారతరత్న వస్తే ఆ అవార్డు తాను తీసుకుంటానన్న వంకతో అడ్డుపడుతున్నారని అన్నారు. అలా అడ్డుపడవద్దని ఆమె కోరారు.

ఎన్టీఆర్ కు భారతరత్న రావాలని, దానిని తీసుకునే విషయంలో ఆయన కుటుంబ సభ్యులు తనపై అభ్యంతరం వ్యక్తం చేస్తే, ఎవరు అర్హులో వారే తీసుకోవాలని ఆమె సూచించారు. అవార్డు ఎవరు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని, ఆయనకు భారతరత్న రావడమన్నదే తనకు ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. 

Telugudesam
ntr
laxmiparvathi
bharata ratna
  • Loading...

More Telugu News