south Korea: ఉత్తరకొరియాతో లావాదేవీలు జరపొద్దు: చైనా బ్యాంకు సంచలన ప్రకటన

  • ఉత్తరకొరియాతో ఆర్థిక లావాదేవీలు జరపొద్దని చైనా సెంట్రల్ బ్యాంకు సంచలన ప్రకటన
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన బ్యాంకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ
  • ఐక్యరాజ్యసమితి అంక్షలను చైనా తప్పకుండా పాటిస్తుందని స్పష్టంచేసిన చైనా సెంట్రల్ బ్యాంక్
  • బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగంపై చైనా సీరియస్

ఉత్తరకొరియాతో ఆర్థిక లావాదేవీలు జరపొద్దని చైనా సెంట్రల్ బ్యాంకు సంచలన ప్రకటన చేసింది. చైనా ప్రభుత్వ బ్యాంకుగా, అతిపెద్ద బ్యాంకుగా పేరొందిన చైనా సెంట్రల్ బ్యాంకు ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన బ్యాంకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల్లో ఐక్యరాజ్యసమితి అంక్షలను చైనా తప్పకుండా పాటిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా అధికారిక మీడియా ఉత్తరకొరియాతో ఆర్థిక కార్యకాలపాలను నిలిపేయాలంటూ సెంట్రల్ బ్యాంకు చేసిన ప్రకటనను ప్రచురించింది.

ఈ నెల (సెప్టెంబర్) 3న ఉత్తరకొరియా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మిస్సైల్ చైనాకు అతి సమీపం నుంచి వెళ్లిందని, దీంతో ఆ దేశ ప్రజలు ఆందోళన చెందారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరకొరియాతో ఎప్పటికైనా ముప్పేనని సరిహద్దు ప్రజలు నిరసన కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే చైనా మండిపడిందని అమెరికా మీడియా పేర్కొంది.  

  • Loading...

More Telugu News