south Korea: ఉ.కొరియా హైడ్రోజన్ బాంబు అమెరికా జపాన్ పై ప్రయోగించిన బాంబుల కంటే ఎంతో పెద్దది: పెంటగాన్

  • ఉత్తరకొరియాను తక్కువ అంచనా వేయొద్దు
  • ఉత్తరకొరియా వద్ద అతి పెద్ద హైడ్రోజన్ బాంబు
  • ఉత్తరకొరియా లక్ష్యం అమెరికా ప్రధాన నగరాలను తాకేలా క్షిపణుల తయారీ 
  • ఉత్తరకొరియా ఆర్థిక వనరులపై దెబ్బకొట్టడం ద్వారా కట్టడి చేయవచ్చనుకున్నా సాధ్యం కాలేదు

ఉత్తరకొరియాను తక్కువగా అంచనా వేయవద్దని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కిమ్ జాంగ్ ఉన్ అంచనా వేసినంత తక్కువ వ్యక్తి కాదని స్పష్టం చేస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా ప్రయోగించిన అణు బాంబుల కంటే చాలా పెద్ద హైడ్రోజన్ బాంబును ఉత్తరకొరియా పరీక్షించి చూసిందని తెలిపాయి. తాజాగా మళ్లీ బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపిన ఉత్తరకొరియా లక్ష్యం ఒకటేనని నిఘా సంస్థ స్పష్టం చేసింది.

అమెరికా ప్రధాన నగరాలను తాకేలా క్షిపణులు తయారు చేస్తామని ఉత్తరకొరియా హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశాయి. అమెరికా ఊహించని విధంగా హైడ్రోజన్ బాంబును పరీక్షించి సత్తాచాటిన సంగతి మరువొద్దని, కిమ్ జాంగ్ ఉన్ ను తక్కువ అంచనా వేయవద్దని స్పష్టం చేస్తూ, ఆ దేశ ఆర్థిక వనరులను దెబ్బతీయడం ద్వారా బాలిస్టిక్ ప్రయోగాలను అడ్డుకోవచ్చనుకోగా అది సాధ్యంకాలేదని గుర్తు చేసింది. దీంతో ఆ దేశంతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

  • Loading...

More Telugu News