agra: ఇదేనా నా భారతావని? నాకు రక్షణెక్కడ?... ప్రశ్నిస్తున్న అసోం విద్యార్థిని

  • సోషల్ మీడియాలో ఓ యువతి ఆవేదన
  • సొంత దేశంలో భద్రత ఎక్కడని ప్రశ్న
  • వైరల్ అయిన అసోం విద్యార్థిని పోస్టు

ఆగ్రాలోని ఇతెమాద్ ఉద్ దౌలా సమాధిని సందర్శించేందుకు వెళ్లిన వేళ, తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన ఓ అసోం విద్యార్థిని, ఇదేనా నా భారతావని? అని ప్రశ్నిస్తోంది. మంజితా చాను అనే విద్యార్థిని తన స్నేహితులతో కలసి ఆగ్రాకు వెళ్లి, అక్కడి చారిత్రక ప్రదేశాలను సందర్శించింది. ఇతెమాద్ ఉద్ దౌలా వద్దకు ఆమె వెళ్లిన వేళ జాతి వివక్షను ఎదుర్కొంది. శరీరపు రంగు, ముఖాకృతిని చూసి ఆమె విదేశీయురాలని భావించిన ఓ అధికారి, ఆమెను అడ్డుకున్నాడు. నువ్వు ఇండియన్ వేనని నిరూపించుకోవాలని కోరాడు. మొత్తం విషయాన్ని మంజితా ఫేస్ బుక్ లో పోస్టు చేసింది.

"వారు మరోసారి ఈశాన్య రాష్ట్రానికి చెందిన అమ్మాయిని విదేశీయురాలని అన్నారు. నేను, నా స్నేహితురాలు, సోదరుడితో కలసి ఆగ్రాకు వెళ్లగా, లోపలికి వెళ్లనీయలేదు. నేను స్పష్టంగా హిందీలో మాట్లాడుతున్నప్పటికీ, నాపై కటువు వైఖరిని ప్రదర్శించారు. నా ఐడీ కార్డు చూడాలని కోరినా ఆ అధికారి వినలేదు. వారి వైఖరితో నాకు షాక్ తగిలింది. అక్కడ లేడీ సెక్యూరిటీ గార్డు లేదు. ఓ గార్డు నన్ను చెక్ చేయాలని చూశాడు. నా బ్యాగ్ లో కొన్ని వ్యక్తిగత వస్తువులు ఉన్నందున నేను అంగీకరించలేదు. లేడీ గార్డుతో చెక్ చేయించుకోవచ్చని నేను చెప్పాను. ఆమె భోజనం చేస్తోందని అక్కడి వ్యక్తి తెలిపాడు.

 అప్పటికే ఆలస్యం అవుతుండగా, ఆమె ఎక్కడుందో చెబితే నేనే వెళ్లి చెక్ చేయించుకుంటానని అన్నాను. ఓ అధికారి చాలా దూరంగా ఉన్న ఓ గది వైపు చూపాడు. నేను అక్కడికి వెళితే ఎవరూ లేరు. చాలా సేపు వేచి చూసిన తరువాత, మేము వాదనకు దిగగా, ఎలాంటి చెకింగ్ లేకుండానే నన్ను లోపలికి పంపారు. భద్రతాంశాల్లో వారి నిర్లక్ష్యం చూసి మరింత షాక్ తగిలింది" అని మంజిత చెప్పింది. ఇదేనా నా భారతావని? నేనిక్కడ క్షేమమేనా? కాదా? అని ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News