sushma swaraj: సుష్మ ఆగ్రహంపై పాక్ ప్రతీకారం... భారత బలగాలను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు!

  • ఐరాసలో ఘాటు వ్యాఖ్యలు చేసిన సుష్మా స్వరాజ్
  • ఆయుధాలతో సరిహద్దులు దాటిన నలుగురు
  • జవాన్లపై కాల్పులు జరపడంతో మొదలైన ఎన్ కౌంటర్

ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రపంచ దేశాల సాక్షిగా, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టిన వేళ, ప్రతీకారం తీర్చుకునే మార్గం కనిపించని దాయాది దేశం మరోమారు ఉగ్రమూకలను ఉసిగొల్పింది. ఈ ఉదయం సరిహద్దులు దాటి యూరీ సెక్టార్ లోకి చొరబడిన ఉగ్రవాదులు భారత జవాన్లను టార్గెట్ చేశారు.

మొత్తం నలుగురు ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలతో వచ్చి భారత బలగాలపై కాల్పులకు దిగారు. ప్రతిగా ఇండియన్ ఆర్మీ కూడా దీటుగా బదులిస్తుండటంతో, ఉదయం ఆరు గంటల నుంచి భీకర ఎన్ కౌంటర్ సాగుతోంది. ఉగ్రవాదులు ఎత్తయిన కొండ ప్రాంతంపై నక్కి కాల్పులు జరుపుతున్నారని సమాచారం. ఉగ్ర కాల్పులను తిప్పి కొడుతున్న భారత బలగాలు, వారిని మట్టుబెట్టే ప్రయత్నంలో ఉన్నాయని సైన్యాధికారి ఒకరు తెలిపారు. కాగా, నిన్న ఐరాసలో ప్రసంగిస్తూ, పాకిస్థాన్ పై సుష్మ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

sushma swaraj
LOC
pakistan
terrorists
  • Loading...

More Telugu News