petrol: 'పెట్రో' ధరలు తగ్గేకాలం వచ్చేసింది: ధర్మేంద్ర ప్రధాన్

  • గత కొంతకాలంగా పెరుగుతున్న ధరలు
  •  ముడి చమురు ఉత్పత్తి తగ్గినందునే
  • ఇప్పటికే పెట్రో ధరలు దిగుతున్నాయ్
  • కొన్ని రోజుల్లో తగ్గుదల స్పష్టమవుతుందన్న కేంద్ర మంత్రి

పెట్రోలు, డీజిల్ తదితరాల ధరలు తగ్గే సమయం వచ్చేసిందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా ధరలు పెరుగుతూ వచ్చాయని, దీనిపై ప్రజల్లో కొంత అసహనం కలిగిన మాట వాస్తవమేనని అంగీకరించిన ఆయన, అమెరికాలో వరుస తుపానుల కారణంగానే ముడి చమురు ఉత్పత్తి తగ్గి ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు.

పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గడం ఇప్పటికే మొదలైందని, మరికొన్ని రోజుల్లో తగ్గుదల స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. వస్తు సేవల పన్ను పరిధిలోకి 'పెట్రో' ఉత్పత్తులను చేర్చే అంశమై కసరత్తు జరుగుతోందని, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అడ్డుపడుతున్నాయని అన్నారు. వారి అభ్యంతరాలను పరిశీలించి, వ్యాపారులు, వాహనదారులకు మేలు కలిగేలా నిర్ణయం తీసుకుంటామని ప్రధాన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News