installments: వాయిదాల ప‌ద్ధ‌తిలో విమాన టికెట్‌ ధర చెల్లింపు... ఇతిహాద్ ఎయిర్‌లైన్స్ వినూత్న ఆఫ‌ర్‌!

  • `ఫ్లై నౌ అండ్ పే లేట‌ర్` పేరిట ఆఫ‌ర్‌
  • 3 నుంచి 60 నెల‌ల వాయిదాల్లో డబ్బు చెల్లించే అవకాశం
  • మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌యాణికుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం
  • ప్రస్తుతం యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్టు ప్రజలకు మాత్రమే ఆఫర్ 

ఇంట‌ర్నెట్ యుగంలోనూ దిగువ‌ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు విమాన ప్రయాణం అంద‌ని ద్రాక్ష‌గానే మారింది. ఎయిర్‌లైన్స్ సంస్థ‌లు ఎన్ని ఆఫ‌ర్లు పెట్టిన‌ప్ప‌టికీ దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌ను ఆక‌ర్షించడంలో పెద్ద‌గా విజ‌యం సాధించలేక‌పోతున్నాయి. కానీ వారిని ఆక‌ర్షించ‌డ‌మే ధ్యేయంగా యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌కు చెందిన ఇతిహాద్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఓ వినూత్న ఆఫ‌ర్ ప్ర‌వేశ‌పెట్టింది.

`ఫ్లై నౌ అండ్ పే లేట‌ర్` పేరిట‌  విమాన టికెట్ డ‌బ్బును వాయిదాల ప‌ద్ధ‌తిలో చెల్లించే అవ‌కాశాన్ని క‌ల్పించింది. దీని ద్వారా టికెట్ డ‌బ్బును 3 నుంచి 60 నెల‌ల వాయిదాల్లో చెల్లించుకునే స‌దుపాయం క‌ల్పించింది. ఇందుకోసం టికెట్ బుక్ చేసుకునేట‌పుడు ‘పే బై ఇన్‌స్టాల్‌మెంట్‌’ ఆప్షన్‌ను ఎంచుకుని క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. విమాన ప్రయాణాన్ని మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావడానికే ఈ ఆఫ‌ర్ ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఇతిహాద్‌ ఎయిర్‌లైన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జస్టిన్‌ వార్బీ తెలిపారు. ప్రసుత్తం ఈ ఆఫర్‌ యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్టు ప్రజలకు మాత్రమే వర్తించ‌నున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News