eatth quake in north korea: ఈ ఉదయం మరో అణుపరీక్ష నిర్వహించిన ఉత్తర కొరియా?
ఉత్తర కొరియాలో ఈ ఉదయం 3.4 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. అయితే ఇది సాధారణ భూకంపమా? లేక ఉత్తర కొరియా మరో అణుపరీక్షను నిర్వహించిందా? అనే అనుమానం తలెత్తింది. చైనా భూకంప విభాగం కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసింది. భారీ విస్ఫోటనం వల్ల ఈ ప్రకంపనలు వచ్చి ఉండవచ్చని అనుమానించింది.
సెప్టెంబర్ 3న కూడా ఉత్తర కొరియా శక్తిమంతమైన అణుప్రయోగం జరిపింది. అప్పుడు కూడా ఇలాంటి ప్రకంపనలే వచ్చాయని చైనా అధికారులు తెలిపారు. పసిఫిక్ మహాసముద్రంపై హైడ్రోజన్ బాంబును పరీక్షిస్తామంటూ నిన్న ఉత్తరకొరియా ప్రకటించింది. దీంతో, భూప్రకంపనలపై ప్రపంచ దేశాలన్నీ అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.