pakistan missile test: విజయవంతంగా క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్
దాయాది దేశం పాకిస్థాన్ నౌకా విధ్వంసక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఉత్తర అరేబియా సముద్రంలో సీ కింగ్ హెలికాప్టర్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని నేవీ చీఫ్ అడ్మిరల్ ముహమ్మద్ జాకాఉల్లా ప్రత్యక్షంగా వీక్షించారు. లక్ష్యాన్ని ఈ మిస్సైల్ కచ్చితంగా ఛేదించిందని నేవీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సందర్భంగా నేవీ చీఫ్ మాట్లాడుతూ, పాకిస్థాన్ ఎల్లవేళలా యుద్ధానికి సిద్ధంగా ఉంటుందనేందుకు ఈ క్షిపణి పరీక్ష విజయవంతమే నిదర్శనమని చెప్పారు. పాక్ నేవీ సన్నద్ధత పట్ల తాను ఎంతో గర్వంగా ఉన్నానని తెలిపారు.