virat kohli: కోహ్లీ విజయాలకు కారణం అతనే!: డేవిడ్ వార్నర్

  • కోహ్లీని తీర్చిదిద్దిన ఘనత ధోనీదే
  • ఓటమి ఎదురైనప్పుడే కెప్టన్ కు సవాల్ మొదలవుతుంది
  • ఇంకా మూడు మ్యాచ్ లు ఉన్నాయి
  • గెలుస్తామన్న విశ్వాసం ఉంది

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడని... ధోనీ అందిస్తున్న సహకారం వల్లే ఇది సాధ్యమైందని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. కోహ్లీలో ఉన్న దూకుడును తగ్గించిన ధోనీ... అతనిలో ప్రశాంతతను తీసుకొచ్చాడని చెప్పాడు. విరాట్ ను మంచి నాయకుడిగా తీర్చి దిద్దడంలో ధోనీ కీలకపాత్ర పోషిస్తున్నాడని తెలిపాడు. జట్టు కెప్టెన్ కు ఒక మాజీ కెప్టెన్ అండగా నిలవడం... ఓ అద్భుతమైన విషయమని చెప్పాడు.

 మ్యాచ్ లు గెలుస్తున్నంత సేపు చాలా బాగుంటుందని... పరాజయాలు పొందుతున్నప్పుడే కెప్టెన్ కు అసలైన సవాల్ ప్రారంభమవుతుందని వార్నర్ అన్నాడు. తమకు ఇంకా మూడు వన్డేలు ఉన్నాయని...వాటిని గెలవగలమనే విశ్వాసం తమకు ఉందని చెప్పాడు. రెండో వన్డేలో భారత్ ను 252 పరుగులకు కట్టడి చేయగలిగినా... ఓటమిపాలు కావడం తమను నిరాశ పరిచిందని అన్నాడు. 

virat kohli
david warner
dhoni
team india
australia cricket
  • Loading...

More Telugu News