tripple talaq: దెబ్బలకు స్పృహతప్పి పడిపోతే... సపర్యలు చేయాల్సింది పోయి ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు!

  • నాలుగేళ్లు సజావుగా సాగిన కాపురం
  • దాంపత్యానికి గుర్తుగా మూడేళ్ల కుమారుడు
  •  పని విషయంలో అత్తమామలతో వివాదం
  • చితక్కొట్టిన భర్త
  • స్పృహ తప్పిపడిపోయిన భార్యకు ట్రిపుల్ తలాక్

కొట్టిన దెబ్బలకు భార్య స్పృహతప్పి పడిపోతే భర్తగా సపర్యలు చేయాల్సింది పోయి, ఆ తర్వాత ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని రాజ్‌ కోట్‌ కి చెందిన రుబీనా (23) కు ఐదేళ్ల క్రితం అఫ్జల్ హుస్సేన్ అనే వ్యక్తితో కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. వారికి మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. నాలుగేళ్లు ఆనందంగా సాగిపోయిన సంసారంలో ఐదోఏట సమస్యలు వచ్చాయి. పని విషయంలో అత్తమామలతో వివాదం రేగగా అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయి.

ఈ క్రమంలో భర్త తనను తీవ్రంగా కొట్టాడని ఆమె తెలిపింది. ఆయన కొట్టిన దెబ్బలకు తాళలేక తాను స్పృహ తప్పి పడిపోతే.. ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయింది. స్పృహలోకి వచ్చిన తరువాత ట్రిపుల్ తలాక్ చెప్పాడని, ఇల్లు విడిచి వెళ్లాలని ఆదేశించాడని తెలిపింది. తను తలాక్ చెప్పడం తనకు వినపడలేదని మొత్తుకున్నా పట్టించుకోలేదని, తనను ఇంటి నుంచి గెంటేశారని ఆమె వాపోయింది. తరువాత తాను పుట్టింటికి చేరానని, అయితే పెద్దల ద్వారా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించానని చెప్పింది. 

tripple talaq
rajkote muslim lady
Muslim husband
  • Loading...

More Telugu News