japan open super series: జపాన్ ఓపెన్ సూప‌ర్ సిరీస్ నుంచి భార‌త్ ఔట్...సెమీస్ ఓడిపోయిన మిక్స్‌డ్ డ‌బుల్స్ జంట‌


జ‌పాన్ ఓపెన్ సూప‌ర్ సిరీస్‌లో ప‌త‌కం సాధించే అవ‌కాశాన్ని భార‌త్ కోల్పోయింది. క‌ష్ట‌ప‌డి సెమీస్‌కు చేరుకున్న మిక్స్‌డ్ డ‌బుల్స్ జంట ప్ర‌ణ‌వ్ జెర్రీ చోప్రా, సిక్కీ రెడ్డీలు ఓడిపోవ‌డంతో జ‌పాన్ సిరీస్‌లో భార‌త్ క్రీడాకారులంద‌రూ నిష్క్ర‌మించిన‌ట్లైంది. జ‌పాన్ జంట త‌కురో హోకి, స‌యాక హిరోటాల చేతిలో వీరు ఓట‌మి పాల‌య్యారు. జపాన్ ఓపెన్ సిరీస్‌లో త‌ప్ప‌కుండా ప‌త‌కం సాధిస్తుంద‌నే అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగిన పీవీ సింధు ఓపెనింగ్ రౌండ్‌లో ఓడిపోయింది. అలాగే సైనా నెహ్వాల్ కూడా ఓపెనింగ్‌లోనే ఓడిపోయింది. క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌కి చేరుకున్న కిడాంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్ర‌ణయ్‌లు.. విక్ట‌ర్ అక్సెల్స‌న్‌, షి యూకీ చేతుల్లో ఓడిపోయారు.

japan open super series
india
semis
mixed doubles
defeat
  • Loading...

More Telugu News