ranbir kapoor: వాళ్లనే అడగచ్చుగా...!: రణబీర్, మహీరా ఖాన్ ల ఫొటోలపై రిషికపూర్ స్పందన!

  • రణబీర్ బ్యాచిలర్
  • తనకు నచ్చిన అమ్మాయిని కలవొచ్చు
  • ఫొటోల వెనుక ఏముందో నాకు తెలియదు
  • వారినే అడిగితే మంచిది

పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ తో బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ కలసి ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యూయార్క్ సిటీలో వీరిద్దరూ సేదతీరుతున్న సందర్భంగా తీసిన ఫొటోలు ఇవి. వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రణబీర్ తండ్రి రిషికపూర్ స్పందించారు. హిందుస్థాన్ టైమ్స్ ఈ ఫొటోల గురించి రిషికపూర్ ను ప్రశ్నించగా... ఈ ఉదయమే తాను కూడా ఫొటోలను చూశానని... ఈ ఫొటోలను పెద్దగా పట్టించుకోనవసరం లేదని... తనను వదిలేయాలని, ఫొటోలో ఉన్నవారినే ఫొటోల గురించి అడగాలని అన్నారు.

"రణ్ బీర్ యంగ్ స్టార్. బ్యాచిలర్. అతనికి ఏ అమ్మాయిని కలవాలని అనిపిస్తే, వారిని కలవొచ్చు" అని రిషికపూర్ చెప్పారు. ఈ ఫొటోల వెనుక ఏముందో మనం ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. వారిద్దరూ బహిరంగప్రదేశంలో ఉన్నారని... రెస్టారెంట్ లో కాని లేదా స్మోక్ చేయలేని ప్రాంతంలో కాని ఉండి ఉంటారని... అందుకే బయటకు వచ్చి సిగరెట్ తాగుతున్నారని చెప్పారు. పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్ తాగకూడదనే కఠిన నిబంధన అమెరికాలో ఉందని చెప్పారు. ఇంతకంటే తాను ఎక్కువ చెప్పలేనని... ఎందుకంటే తనకు ఏమీ తెలియదని అన్నారు. 

ranbir kapoor
mahira khan
rishi kapoor
rambir leaked pics
bollywood pakistan actress
  • Loading...

More Telugu News