rajasekhar: ఆసక్తిని రేపుతోన్న 'గరుడ వేగ' టీజర్

  • ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గరుడవేగ'
  •  చాలా గ్యాప్ తరువాత రాజశేఖర్ చేస్తోన్న మూవీ
  •  సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ
  •  భారీ ఛేజింగులతో ఆకట్టుకుంటోన్న టీజర్  

ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మెన్ గా మంచి మార్కులు కొట్టేసిన రాజశేఖర్, ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల ముందుకు రాలేదు. వరుస పరాజయాలు ఎదురుకావడమే అందుకు కారణం. పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో ఎక్కువగా ఆడియన్స్ ను ఆకట్టుకున్న రాజశేఖర్, అదే తరహా పాత్రను ఇప్పుడు గరుడ వేగ'లో పోషించారు. దాదాపు 25 కోట్ల బడ్జెట్ తో ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగును పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ఛేజింగులు .. ఫైరింగులతో .. చివరిలో కాస్తంత కామెడీ టచ్ తో ఈ టీజర్ ను ఆసక్తికరంగానే కట్ చేశారు. తన స్టైల్ కి తగిన సినిమా కావడంతో దీనిపై రాజశేఖర్ భారీ ఆశలే పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. పూజాకుమార్ .. శ్రద్ధా కపూర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. 

rajasekhar
pooja kumar
  • Error fetching data: Network response was not ok

More Telugu News