kuldeep yadav: హ్యాట్రిక్ బాల్ కు ముందు ధోనీ సలహా తీసుకున్న కుల్దీప్

  • ధోనీ సూచన ఆత్మ విశ్వాసాన్ని పెంచింది
  • తొలి ఐదు ఓవర్లలో ఇబ్బంది పడ్డా
  • ఆ తర్వాత సరైన స్పాట్ ను గుర్తించా

ఆస్ట్రేలియాతో కోల్ కతాలో జరిగిన రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించి చరిత్ర పుటల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, చేతన్ శర్మల తర్వాత వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో భారత బౌలర్ గా కుల్దీప్ అవతరించాడు. ఈ సందర్భంగా కుల్దీప్ మాట్లాడుతూ ధోని ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాను హ్యాట్రిక్ సాధించానని చెప్పాడు.

వరుసగా రెండు వికెట్లు తీసిన తర్వాత, హ్యాట్రిక్ బాల్ వేసే ముందు తాను ధోనీని సంప్రదించానని... 'మహీ భాయ్, ఎలాంటి బాల్ వేయమంటావ్?' అని అడిగానని తెలిపాడు. దానికి సమాధానంగా, 'నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ బాల్ వెయ్' అంటూ ధోనీ ప్రోత్సహించాడని... ధోనీ మాటలతో తనలో ఆత్మ విశ్వాసం పెరిగిందని... చివరకు హ్యాట్రిక్ సాధించగలిగానని చెప్పాడు.

తొలి ఐదు ఓవర్లలో సరైన స్థానంలో బంతులను సంధించడానికి తాను ఇబ్బంది పడ్డానని... ఐదు ఓవర్ల తర్వాత కరెక్ట్ స్పాట్ ను గుర్తించానని... ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందేనని కుల్దీప్ అన్నాడు.  

kuldeep yadav
ms dhoni
team india
australia cricket
odi
kuldeep hatrick
  • Loading...

More Telugu News