Russia: భారత్‌లో ‘బ్లూవేల్’ భరతం పట్టేందుకు రష్యా సహకారం!


దేశంలో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న బ్లూవేల్ గేమ్ భరతం పట్టేందుకు రష్యా ముందుకొచ్చింది. ఈ మేరకు చెన్నైలోని ఇండో-రష్యన్ సెంటర్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ చైర్మన్, మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ ఆర్.రాజగోపాల్ మదురై బెంచ్‌కు రష్యా ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖను అందించారు. భారత్‌లో పెరిగిపోతున్న ‘బ్లూవేల్’ జాడ్యాన్ని అంతమొందించేందుకు రష్యా సహకారం అందించనున్నట్టు అందులో పేర్కొన్నారు.

రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ కల్చర్ వైస్-కాన్సుల్, డైరెక్టర్ మైఖేల్ జె.గోబర్టోవ్, దక్షిణ భారతదేశంలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ది రష్యన్ ఫెడరేషన్ నుంచి అందిన ఈ-మెయిల్‌ను కోర్టుకు అందజేశారు. బ్లూవేల్ గేమ్ తొలుత 2013లో వికొంటక్టేలో ప్రారంభమైనట్టు అందులో పేర్కొన్నారు. తక్కువ నిడివిగల ఈ గేమ్‌ను ఆడాల్సిందిగా టీనేజర్లకు సూచిస్తుంటారని తెలిపారు. ఈ గేమ్ ఇండియాతోపాటు మరో డజను దేశాల్లోనూ విస్తరించిందని పేర్కొన్నారు.  అయితే ఈ గేమ్ నివారణకు తీసుకోబోయే చర్యల గురించి అందులో పేర్కొనలేదు.

  • Loading...

More Telugu News