China: ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా చైనా రియల్ ఎస్టేట్ డెవలపర్!

  • రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్
  • ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో బిల్‌గేట్స్
  • మూడో స్థానానికి పడిపోయిన జాక్ మా

చైనా రియల్ ఎస్టేట్ డెవలపర్ 'చైనా ఎవర్‌గ్రాండె' గ్రూప్ చైర్మన్ హుయి కా యాన్ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ మేగజైన్ జాబితాకెక్కాడు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం.. హుయి 42.2 బిలియన్ డాలర్లతో అగ్రస్థానాన్ని అలంకరించగా టాన్సెంట్ హోల్డింగ్స్ చైర్మన్ మా హాటెంగ్ 39.1 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచాడు. అలీబాబా గ్రూప్ చైర్మన్ జాక్ మా 38.9 బిలియన్ డాలర్లు, వండా గ్రూప్ చైర్మన్ వాంగ్  జియన్‌లిన్ 30.4 బిలియన్ డాలర్లతో వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఈ గ్రూపులో నిలిచిన చైనా ధనవంతుల్లోని ప్రతి ఒక్కరు ఈ ఏడాది ఏదో ఒక సమయంలో అత్యంత ధనవంతులుగా నిలిచినవారే కావడం గమనార్హం. ప్రస్తుతం బిల్‌గేట్స్ 85.7 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతుండగా హుయి అతడికి అందనంత దూరంలో ఉన్నాడు. ప్రపంచ కుబేరుల జాబితాలో హుయి 15వ స్థానంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News