baba ramdev: మానవునికి 400 ఏళ్లు బతికే సామర్థ్యం ఉంది: రాందేవ్ బాబా

  • మానవ శరీరం 400 ఏళ్లు మనుగడ సాగించేలా రూపొందింది
  • అనారోగ్యకర అలవాట్లతో దానిని పాడుచేసుకుంటున్నాం
  • ఆరోగ్యకర అలవాట్లతో అమిత్ షా బరువు తగ్గారు
  • ఉడికించిన వెజిటబుల్స్, సూప్ తో ఆయన 38 కేజీల బరువు తగ్గారు
  • అనారోగ్యకర భోజనాన్ని వదిలెయ్యాలి

మానవునికి 400 ఏళ్లు బతకగలిగే సామర్థ్యం ఉందని బాబా రాందేవ్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన 12వ జాతీయ నాణ్యత సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మానవ శరీర నిర్మాణం 400 ఏళ్లు మనుగడ సాగించగలిగే శక్తితో రూపొందిందని అన్నారు. అయితే అనారోగ్యకరమైన అలవాట్లతో దానిని మనం పాడుచేసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఆరోగ్యకరమైన అలవాట్లతో తరచు వ్యాయామం చేస్తే ఎక్కువ కాలం బతికే అవకాశం ఉందని ఆయన అన్నారు.

అనారోగ్యకరమైన అలవాట్లతో రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులతో బాధపడుతూ మందులతో సహవాసం చేస్తున్నామని ఆయన తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కచ్చితమైన డైట్ పాటించడం ద్వారా 38 కేజీల బరువు తగ్గారని ఆయన వెల్లడించారు. ఆయన మధ్యాహ్న భోజన పరిమాణం తగ్గించడంతో పాటు, రాత్రుళ్లు కేవలం ఉడకబెట్టిన కూరగాయలు, సూపు మాత్రమే తీసుకున్నారని, దీంతో ఆయన బరువు గణనీయంగా తగ్గిందని ఆయన తెలిపారు. అనారోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవడం తగ్గించాలని ఆయన సూచించారు. 

baba ramdev
amith sha
health
400 years life
healthy food
  • Loading...

More Telugu News