Mizoram: 30 ఏళ్ల తర్వాత మిజోరం కేబినేట్ లో మహిళ!


మూడు దశాబ్దాల తర్వాత మిజోరం కేబినెట్‌లో ఓ మహిళ స్థానం సంపాదించుకున్నారు. లాలామ్‌పుయి చౌంగ్తు శుక్రవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్భయ్ శర్మ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన చంగ్తు, కేఎస్ తంగలకు వచ్చే వారం పదవులు కేటాయించనున్నట్టు ముఖ్య కార్యదర్శి లాల్మాల్‌సామా తెలిపారు. కార్మిక శాఖా మంత్రి లాల్‌రిన్మావియా రాల్టె, మత్స్య శాఖా మంత్రి బుద్ధ ధాన్ చక్మాలు రాజీనామాలు చేయడంతో వారి స్థానంలో వీరిని తీసుకున్నారు.

Mizoram
Lalawmpuii Chawngthu
woman minister
  • Loading...

More Telugu News