BSNL: బీఎస్ఎన్ఎల్ దసరా ఆఫర్.. రీచార్జ్ వోచర్లపై 50 శాతం క్యాష్ బ్యాక్

  • ‘దసరా విజయ్’తో ముందుకొచ్చిన బీఎస్ఎన్ఎల్
  • ఫుల్ టాక్ టైం ఆఫర్ కూడా
  • ఈ నెల 25 నుంచి అందుబాటులోకి..

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) దసరా పండుగను పురస్కరించుకుని దసరా విజయ్’ పేరుతో రీచార్జ్ వోచర్లపై 50 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. దీంతోపాటు బీఎస్ఎన్ఎల్ మొబైల్ యాప్, వెబ్‌సైట్ ద్వారా రీచార్జ్ చేసుకున్న వినియోగదారులు ఫుల్ టాక్ టైం పొందవచ్చని తెలిపింది. ఇది పరిమిత కాల ఆఫర్. ఈ రెండు ఆఫర్లను దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు అందరూ వినియోగించుకోవచ్చని, ఈనెల 25 నుంచి ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది.

ఆఫర్‌లో భాగంగా ఈ నెల 25 నుంచి వచ్చే నెల 25 మధ్య రీచార్జ్ ప్యాక్స్ కొనుగోలు చేసే వారికి 50 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. రూ.42, రూ.44, రూ.65, రూ.69, రూ.88, రూ.122 రీచార్జ్ వోచర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. ఫుల్ టాక్ టైం ఆఫర్ మాత్రం ఒక్క రూ.30 రీచార్జ్‌కే వర్తిస్తుందని, ఈ ఆఫర్ 25న ప్రారంభమై అక్టోబరు 2తో ముగుస్తుందని వివరించింది.

పండుగ సమయాల్లో వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తుంటామని, ఈసారి 50 శాతం క్యాష్ బ్యాక్‌ ఆఫర్‌తో వచ్చినట్టు బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ ఆర్‌కే మిట్టల్ తెలిపారు.

BSNL
Cashback
Talk Time Vouchers
Dussehra
  • Loading...

More Telugu News