rahul gandhi: గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, మౌలానా, సర్దార్ పటేల్ అంతా ఎన్నారైలే: రాహుల్ గాంధీ

  • గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ లు ఇంగ్లండ్ లో వుండి వచ్చారు
  • ఎన్నారై ఉద్యమం నుంచే కాంగ్రెస్ పుట్టింది
  • ప్రగతిశీల భావాలతో స్వాతంత్ర్యోద్యమం మొదలైంది
  • అదే స్ఫూర్తితో ఎన్నారైలు దేశ ప్రగతికి సహాయపడాలి

మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా తదితరులంతా ఎన్నారైలేనని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నారై ఉద్యమం నుంచే కాంగ్రెస్‌ పార్టీ ఉద్భవించిందని అన్నారు.

 ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులంతా విదేశాల నుంచి భారత్ కు తిరిగి వచ్చి, తమ అనుభవాలు, ప్రగతిశీల ఆలోచనలతో దేశస్వాతంత్ర్యం కోసం పాటుపడ్డారని అన్నారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ తదితరులు ఇంగ్లండ్ లో విద్యనభ్యసించి, ఉద్యోగాలు చేసుకుంటున్న దశలో వాటిని వదిలి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని ఆయన చెప్పారు. నేటి ఎన్నారైలు కూడా తమ ఆలోచనలతో దేశాన్ని ప్రగతిపథాన నడపాలని ఆయన సూచించారు. 

  • Loading...

More Telugu News