ntr: ప్రేక్ష‌కులు చూపిన ప్రేమ చాలా సంతృప్తిని ఇచ్చింది: ఎన్టీఆర్‌

  • ‘జై లవకుశ’ సినిమాకు వస్తోన్న స్పంద‌నపై తార‌క్ హ‌ర్షం 
  • ఓ నటుడిగా దీని కన్నా ఉత్తమమైనది ఏమీ అడగను

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘జై లవకుశ’ సినిమాకు మంచి స్పంద‌న వ‌స్తుండ‌డంతో తార‌క్ హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. తొలి రోజున ఈ సినిమా భార‌త్‌లో సుమారు రూ. 24 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే అమెరికాలో మొన్న‌టి ప్రీమియర్‌ షో రూ. 3.64 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా దూసుకుపోతుండ‌డంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కులు చూపిన ప్రేమ చాలా సంతృప్తిని ఇచ్చిందని ఎన్టీఆర్ అన్నారు. తాను ఓ నటుడిగా దీని కన్నా ఉత్తమమైనది ఏమీ అడగనని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నాడు. అందరికీ త‌మ సినీ యూనిట్ నుంచి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు తెలిపాడు. 

ntr
  • Loading...

More Telugu News