ramoji rao: కేసీఆర్ గారూ.. ఇలాగే ముందుకు సాగండి!: అభినందన లేఖ రాసిన రామోజీరావు

  • ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నందుకు అభినందనలు
  • తెలుగు భాషను 12వ తరగతి వరకు తప్పనిసరి చేయడం గొప్ప విషయం
  • పాలనా వ్యవహారాల్లో తెలుగును అనివార్యం చేయాలి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు లేఖ రాశారు. ప్రపంచ తెలుగు మహాసభలను తొలిసారి రాష్ట్రంలో నిర్వహిస్తున్నందుకు లేఖలో అభినందనలు తెలిపారు. మహాసభలు విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు.

తెలుగు భాషను మరింత పటిష్టపరిచేందుకు తీసుకున్న బలమైన నిర్ణయంగా రామోజీ అభివర్ణించారు. ఇదే విధంగా ముందుకు సాగాలని... ఉద్యోగ నియామకాల్లో కూడా తెలుగు ప్రజ్ఞను అనివార్యం చేయాలని సూచించారు. తెలుగు భాషను మరింత విస్తృతం చేయాలంటే... పరిపాలనా వ్యవహారాల్లో కూడా తెలుగును తప్పనిసరి చేయాలని రామోజీరావు తన లేఖలో అభిప్రాయపడ్డారు.

ramoji rao
ramoji group
kcr
telangana cm
kcr letter to ramoji rao
  • Loading...

More Telugu News