rajinikanth: మోదీ కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా: రజనీకాంత్

  • పరిశుభ్రతే దైవభక్తి అన్న సూపర్ స్టార్
  • మోదీకి పూర్తి మద్దతు పలికిన సూపర్ స్టార్
  • గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం



ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమానికి పూర్తి మద్దతు పలుకుతున్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. 'పరిశుభ్రతే దైవభక్తి' అంటూ ఆయన ట్వీట్ చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15న ప్రారంభించారు. గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి మద్దతు పలకాలని మోదీ కోరారు. పలువురు ప్రముఖులకు స్వయంగా లేఖలు కూడా రాశారు. టాలీవుడ్ ప్రముఖులు మహేష్ బాబు, ప్రభాస్, మోహన్ బాబు, రాజమౌళిలకు కూడా లేఖలు రాశారు. మరోవైపు ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నట్టు సచిన్ టెండూల్కర్, అనుష్క శర్మ, అక్షయ్ కుమార్ తదితరులు ప్రకటించారు.

rajinikanth
swachchata hi seva
rajini tweet
rajinikanth suppor to modi
  • Loading...

More Telugu News