jagan: సీబీఐ కోర్టుకు జగన్, విజయసాయి, గాలి జనార్దన్ రెడ్డి... గాలి పీఏకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

  • అక్రమాస్తుల కేసు
  • కోర్టుకు హాజరైన జగన్, విజయసాయి, సబిత
  • మైనింగ్ కేసులో కోర్టుకు వచ్చిన గాలి
  • కోర్టుకు హాజరుకాని గాలి పీఏ

అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ కాసేపటి క్రితం హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఏ-2 నిందితుడు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు వచ్చారు. తన కుమార్తె చదువు నిమిత్తం జగన్ లండన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్ననే ఆయన లండన్ నుంచి హైదరాబాదుకు తిరిగి వచ్చారు. ఈ రోజు శుక్రవారం కావడంతో, కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంది. దీంతో, ఆయన కోర్టుకు వచ్చారు.

వీరితో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిలు కూడా కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు, ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి కూడా కోర్టుకు వచ్చారు. ఆయన పీఏ అలీఖాన్ మాత్రం హాజరుకాలేదు. దీంతో, అలీ ఖాన్ పై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది.

jagan
vijayasai reddy
gali janardhan reddy
sabita indra reddy
srilakshmi ias
  • Loading...

More Telugu News