paritala sriram: మొండోళ్లం, బండోళ్లం... హాని చేస్తే ఎవరైనా శత్రువే: పరిటాల శ్రీరామ్ పవర్ ఫుల్ స్పీచ్ వీడియో!

  • హాని తలపెట్టే ఎవడైనా శత్రువే
  • పరిటాల రవి ఆశయ సాధనే నా లక్ష్యం
  • కార్యకర్తలతో పరిటాల శ్రీరామ్

తన తండ్రి పరిటాల రవి ఆశయాలను సాధించేందుకు కట్టుబడి ఉన్నానని యువనేత పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఓ సభలో మాట్లాడిన శ్రీరామ్, ఆవేశంగా ప్రసంగించారు. తన కుటుంబానికి గానీ, మద్దతుదారులకుగానీ హాని చేయాలని చూసేవారెవరైనా తనకు శత్రువులేనని అన్నారు. జిల్లాలో తన తండ్రి ఉన్నప్పుడు అభివృద్ధి పరుగులు పెట్టిందని, తిరిగి అదే పరిస్థితి త్వరలో వస్తుందని అన్నారు.

"మేము మొండినా కొడుకులం. బండనా కొడుకులం. మాకు హాని తలపెట్టని వాళ్లంతా మావాళ్లే. మావాళ్లకు హాని తలపెట్టే ప్రతి ఒక్కడూ మాకు శత్రువే. రాబోయే రోజుల్లో పరిటాల చెప్పిన మాటలు, ఆయన చేసిన ప్రాణత్యాగం స్ఫూర్తితో ముందుకు సాగుతాం" అన్నారు. తన కుటుంబానికి అభిమానులు అండగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యకర్తలే తనకు బలమని అన్నారు. పరిటాల ప్రసంగించిన వీడియోను మీరూ చూడవచ్చు.

paritala sriram
paritala ravi
  • Loading...

More Telugu News