TRS: మంత్రి సమక్షంలో నిప్పంటించుకున్న టీఆర్ఎస్ నేత మృతి

  • మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో నిప్పంటించుకున్న నేత
  • అపోలో ఆసుపత్రిలో కన్నుమూత
  • నివాళి అర్పించిన మంత్రి
  • మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్న మహేందర్

తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో నిప్పంటించుకున్న టీఆర్ఎస్ నేత, వికారాబాద్ జిల్లా తాండూరు పట్లణ మాజీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆగస్టు 30వ తేదీన తాండూరులో జరిగిన పార్టీ మీటింగ్ లో అయూబ్ ఖాన్ నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో అయూబ్ తల, ఛాతీ భాగాలు తీవ్రంగా కాలిపోయాయి. వెంటనే అక్కడున్న నాయకులు, కార్యకర్తలు, పోలీసులు ఆయనను జిల్లా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

అనంతరం అతని పరిస్థితి విషమంగా మారడంతో, హైదరాబాద్ కు తరలించారు. గాయాలు తీవ్రతరం కావడంతో గత కొన్ని రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఉద్యమకారులకు పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదనే ఆవేదనతో ఆయన మంత్రి సమక్షంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. అయూబ్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి మహేందర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి సంతాపం ప్రకటించారు. అయూబ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

TRS
TRS leader dead
minister mahender reddy
  • Loading...

More Telugu News