kamal haasan: వచ్చే వంద రోజుల్లో ఎన్నికలు జరిగితే తప్పకుండా పోటీ చేస్తానన్న కమల్.. రజనీకాంత్ కూడా అభినందించారన్న సూపర్ స్టార్!

  • మొదటిసారి స్పష్టత ఇచ్చిన కమల్
  • ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన
  • ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే యోచన లేదన్న సూపర్ స్టార్
  • రజనీకాంత్‌ను కలిశానన్న కమల్
  • ఇద్దరి లక్ష్యం ఒకటే అయినా దారులు మాత్రమే వేరన్న నటుడు

తన రాజకీయ రంగ ప్రవేశంపై తమిళ సూపర్ స్టార్ కమల హాసన్ తొలిసారి స్పష్టత ఇచ్చారు. వచ్చే వంద రోజుల్లో కనుక ఎన్నికలు జరిగితే తాను తప్పకుండా బరిలోకి దిగుతానని తేల్చి చెప్పాడు. అయితే ప్రస్తుతం ఉన్న ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని, ఒంటరిగా ముందుకు వెళ్లనున్నట్టు పేర్కొన్నాడు. అన్ని పార్టీలకు సహకరిస్తానని, అయితే ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.

అన్నాడీఎంకేలో నెలకొన్న వివాదాలపై కమల్ స్పందిస్తూ.. అదో బలవంతపు వివాహమని, ఈ పెళ్లి నుంచి వధువు బయటకు రావాలని తమిళ ప్రజలు కోరుకుంటున్నారని కమల్ పేర్కొన్నారు. వచ్చే  మూడు నెలల్లో కనుక ఎన్నికలు జరిగితే తాను తప్పనిసరిగా పోటీ చేస్తానని పునరుద్ఘాటించారు.

కమల్ మరో షాకింగ్ విషయం కూడా చెప్పారు. తాను సహ నటుడు రజనీకాంత్‌ను కలిశానని, ఆయన తన వెన్నుతట్టి అభినందించారని కమల్ పేర్కొన్నారు. నాలుగైదు వారాల క్రితం తాను రజనీని కలిశానని తెలిపారు. ఇద్దరికీ ఒకే రకమైన లక్ష్యం ఉందని, తొలుత అవినీతిని రూపుమాపాల్సి ఉందని అన్నారు. ఇద్దరి లక్ష్యం ఒకటే అయినా దారులు మాత్రం వేరని కమల్ స్పష్టం చేశారు. రజనీని తాను హత్తుకున్నానని, ఈ సందర్భంగా రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్టు ఆయనకు చెప్పానని పేర్కొన్నారు.

ఒకవేళ రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెడితే ఇద్దరు సూపర్‌స్టార్ల మధ్య రాజకీయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. తాము సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ప్రత్యర్థులుగా మారితే రాజకీయ ప్రత్యర్థులకు ఒక ఉదాహరణగా నిలవాలని ఇద్దరం నిర్ణయించుకున్నట్టు కమల్ పేర్కొన్నారు. ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడం ఉండదన్నారు.

kamal haasan
tamil
actor
Rajini kanth
political party
  • Loading...

More Telugu News